t-congress: 2019 ఓటర్ల జాబితా ఆధారంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి: మర్రి శశిధర్ రెడ్డి

  • ఓటర్ల జాబితాను సరిచేయాలి
  • ఆ బాధ్యత ప్రభుత్వంతో పాటు ఈసీ పైనా ఉంది
  • 2018 ఓటర్ల జాబితాతో బీసీ రిజర్వేషన్లు అమలు చేయొద్దు

తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని, తప్పుల తడకగా ఉన్న ఓటర్ల జాబితాతోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందని టీ-కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓటర్ల జాబితాను సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం పైనా ఉందని అన్నారు. 2019 ఓటర్ల జాబితా ఆధారంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలు గురించి మాట్లాడుతూ, 2018 ఓటర్ల జాబితాతో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే కనుక బీసీలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు.

t-congress
marri sasidhar reddy
panchat elections
  • Loading...

More Telugu News