perth test: పెర్త్ టెస్టు.. ముగిసిన రెండో రోజు ఆట..టీమిండియా స్కోర్:172/3

  • విరాట్ కోహ్లీ 181 బంతుల్లో 82 పరుగులు
  • రహానె 103 బంతుల్లో 51 పరుగులు
  •  ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 326 పరుగులు 

పెర్త్ స్టేడియం వేదికగా ఇండియా - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 69 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి విరాట్ కోహ్లీ 181 బంతుల్లో 82 పరుగులు చేయగా, రహానె 103 బంతుల్లో 51 పరుగులు చేశారు.

కాగా, తొలి ఇన్నింగ్స్ లో 277/6 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ జట్టు మరో 49 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారతజట్టు మొదట్లోనే నిరాశకు గురైంది. ఓపెనర్లు రాహుల్ (2), మురళీ విజయ్ (0) పెవిలియన్ ముఖం పట్టగా, పూజారా 24 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లు స్టార్క్ రెండు వికెట్లు తీసుకోగా, హాజెల్ వుడ్ ఒక వికెట్ తీశాడు.

perth test
Australia
india
second test
  • Loading...

More Telugu News