OnePlus 6T: 10 జీబీ ర్యామ్ తో 'వన్ ప్లస్ 6టీ' మెక్ లారెన్ ఎడిషన్ విడుదల!

  • ఈరోజు నుండే అందుబాటులోకి 
  • ధర రూ.50999
  • ఎక్స్చేంజ్ ఆఫర్, యాక్సిస్ బ్యాంకు కార్డులపై పలు ఆఫర్లు

వన్ ప్లస్ 6టీ ఇప్పుడు మరో ఎడిషన్ లో కూడా వినియోగదారులకి అందుబాటులోకి రానుంది. గతంలో వన్ ప్లస్ 6 అవెంజర్ ఎడిషన్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా వన్ ప్లస్ 6టీ 'మెక్ లారెన్ ఎడిషన్'లో లభ్యం కానుంది. ఈరోజు నుండే విక్రయానికి అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్లో 10 జీబీ ర్యామ్ ని ఏర్పాటు చేశారు. దీని ధర రూ.50999గా నిర్ణయించారు.ఈ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ తో పాటు యాక్సిస్ బ్యాంకు కార్డులపై పలు ఆఫర్లు కూడా ఉన్నాయి.

'వన్ ప్లస్ 6టీ' ప్రత్యేకతలు:

  • 6.41" ఫుల్ హెచ్డీ డిస్ప్లే (1080 x 2340 పిక్సల్స్)
  • స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్
  • ఆండ్రాయిడ్ 9పై ఆపరేటింగ్ సిస్టం
  • 10 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • 16/20 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు
  • 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 3700 ఎంఏహెచ్ బ్యాటరీ

  • Error fetching data: Network response was not ok

More Telugu News