RANA: రానా పుట్టినరోజు వేడుకలో రామ్ చరణ్, అఖిల్‌!

  • 34వ జన్మదిన వేడుకలు జరుపుకున్న రానా
  • బర్త్ డే పార్టీలో సందడి చేసిన పలువురు సన్నిహితులు
  • ఫోటో షేర్ చేసిన రానా

నటుడు దగ్గుబాటి రానా నిన్న తన 34వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ వేడుక‌కి రామ్ చ‌ర‌ణ్‌, అఖిల్‌, సానియా మీర్జాతో పాటు ప‌లువురు సన్నిహితులు హాజరై సందడి చేశారు. పార్టీకి సంబంధించిన ఫోటోని రానా తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసి 'నా వైపు నుండి ఎల్లప్పుడూ కొందరిని మిస్ అవుతూ ఉంటాను. కానీ, నా జీవితాన్ని ఆనందంగా మార్చినందుకు ధన్యవాదాలు' అంటూ ఓ కామెంట్ ని జత చేశాడు. కాగా, రానా పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

RANA
Ramcharan
AKHIL
Tollywood
BIRTH DAY PARTY
  • Loading...

More Telugu News