sharwanand: సాయిపల్లవి నటన చూసి షాక్ అయ్యాను: శర్వానంద్

- సాయిపల్లవి సహజ నటి
- పాత్రని ఓన్ చేసుకునే తీరు అద్భుతం
- ఆమెతో పోటీపడి చేశాను
హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన 'పడి పడి లేచె మనసు' ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. శర్వానంద్ - సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైపోయాయి. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో శర్వానంద్ మాట్లాడుతూ .. " ముందుగా హను రాఘవపూడి నా దగ్గరకి ఒక యాక్షన్ మూవీ చేద్దామని వచ్చాడు. లవ్ స్టోరీ అయితేనే చేస్తానని నేను అనడంతో, ఈ కథను సిద్ధం చేసుకుని వచ్చి వినిపించాడు.
