Madhya Pradesh: కొన్ని నిర్ణయాలు మనకు వ్యతిరేకంగా ఉంటాయి.. అదే జీవితమంటే!: మధ్యప్రదేశ్ సీఎం పోస్టుపై జ్యోతిరాదిత్య సింధియా

  • పార్టీ నాకు ఎంతో ఇచ్చింది
  • 35 ఏళ్లకే మంత్రిని చేసింది
  • అన్ని నిర్ణయాలు మనకు అనుకూలంగా ఉండవు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ కమల్‌నాథ్‌ను నియమించడంపై ఆ పార్టీ యువనేత జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. సీఎం పోస్టు కోసం చివరి వరకు పోటీలో నిలిచినా అధిష్ఠానం చివరికి కమల్‌‌నాథ్‌కే పగ్గాలు అప్పగించింది. కమల్‌నాథ్‌కు అధిష్ఠానం జై కొట్టడంపై సింధియా మాట్లాడుతూ.. తాను పార్టీ కార్యకర్తను మాత్రమేనని, పార్టీ నిర్ణయాలు అన్ని వేళలా మనకు అనుకూలంగా ఉండవని పేర్కొన్నారు. జీవితమంటే అదేనని నిర్వేదం వ్యక్తం చేశారు. పార్టీ తనను 35 ఏళ్లకే మంత్రిని చేసిందని చెప్పుకొచ్చారు. తనకోసం పార్టీ ఎంతో చేసిందన్న ఆయన.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 300 శాతం కష్టపడ్డానని పేర్కొన్నారు.

Madhya Pradesh
Kamal Nath
Jyotiraditya Scindia
Rahul Gandhi
  • Loading...

More Telugu News