Chinaman bowlar: కుల్దీప్ యాదవ్‌కు చైనా భాషలో బర్త్‌డే విషెస్ చెప్పిన సచిన్

  • 24వ బర్త్ డే జరుపుకున్న కుల్దీప్
  • ట్విట్టర్‌లో శుభాకాంక్షల మోత
  • సచిన్ ట్వీట్‌కు ఫిదా

టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వెరైటీగా బర్త్‌డే విషెస్ తెలిపాడు. స్పిన్నర్ కుల్దీప్ ఈ నెల 14న 24వ బర్త్ డేను జరుపుకున్నాడు. సచిన్ అతడికి బర్త్‌డే విషెస్‌ను చైనా భాషలో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

చైనామన్ బౌలర్‌కు చౌనీస్‌లో విషెస్ చెబుతున్నట్టు పేర్కొన్న సచిన్ హ్యాపీ బర్త్‌డే అని పేర్కొన్నాడు. సచిన్ చమత్కారానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరోవైపు, కుల్దీప్‌కు పలువురు తాజా, మాజీ క్రికెటర్లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కుల్దీప్ స్పిన్ మాయాజాలం మున్ముందు కూడా కొనసాగాలని ఆకాంక్షించారు.

Chinaman bowlar
Kuldeep yadav
Chinese
Sachin Tendulkar
Birth day
  • Loading...

More Telugu News