Cow: హిమాచల్‌ప్రదేశ్‌ ‘రాష్ట్రమాత’గా గోవు!

  • తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఎమ్మెల్యే
  • ఆమోదించిన అసెంబ్లీ
  • గోవుకు కులమతాలు లేవన్న శాసనసభ్యుడు

హిమాచల్‌ప్రదేశ్ ‘రాష్ట్రమాత’గా గోవును ప్రకటిస్తూ అసెంబ్లీ తీర్మానించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ సింగ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఇప్పుడు దీనిని కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. తీర్మానం ఆమోదం పొందిన అనంతరం అనిరుధ్ మాట్లాడుతూ.. గోవుకు కులమతాలు లేవన్నారు. మానవాళికి ఇది ఎంతో ఉపయోగకరమైన జంతువు అని పేర్కొన్నారు. అది వట్టిపోయినప్పుడు మాత్రమే యజమానులు వాటిని వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గో సంరక్షణ పేరుతో కొందరు హింసకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కారణాలతోనే గోవును రాష్ట్రమాతగా ప్రకటించినట్టు అనిరుధ్ తెలిపారు.

Cow
mother of state
Himachal Pradesh
Assembly
Anirudh singh
  • Loading...

More Telugu News