Gujarath: వాదోపవాదనలు జరుగుతుండగా కోర్టులోకి చిరుతపులి.. భయంతో పరుగులు తీసిన జడ్జీ, లాయర్లు

  • అందరి దృష్టి వాదోపవాదనల పైనే...
  • చిరుతపులిని ఎవ్వరూ గుర్తించలేదు
  • అటవీ అధికారులకు సమాచారం

గుజరాత్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సురేంద్రనగర్ జిల్లాలోని చోటిల్లా కోర్టులో వాదోపవాదనలు జరుగుతుండగా ఊహించని అతిథి వచ్చి అందరినీ పరుగులు పెట్టించింది. ఆ ఊహించని అతిథి ఎవరో కాదు.. చిరుత పులి. కొండ ప్రాంతమైన చోటిల్లా పట్టణం చుట్టూ అడవి విస్తరించి ఉంది.

ఆ అడవి నుంచి హఠాత్తుగా కోర్టులో శుక్రవారం వాదోప వాదనలు జరుగుతుండగా అందరి దృష్టి అటువైపే ఉంది. చిరుత పులి వచ్చిన విషయాన్ని కూడా ఎవ్వరూ గుర్తించలేదు. తర్వాత చూసిన కొందరు అందరినీ హెచ్చరిస్తూ బయటకు పరుగులు తీశారు. వెంటనే చిరుతను చూసి అవాక్కయిన న్యాయమూర్తి, లాయర్లు, ఇతర సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అనంతరం పులిని లోపలే ఉంచి తలుపులు మూసి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు.

Gujarath
Leopard
Chotilla
Court
Lawyer
  • Loading...

More Telugu News