bengali: బెంగాలీ రచయిత అమితవ్ ఘోష్ కు దక్కిన జ్ఞానపీఠ్ పురస్కారం

  • సాహిత్యంలో అత్యుత్తమ సేవలు అందించిన అభినవ్
  • చరిత్రను ఆధునిక యుగానికి తగినట్టుగా రాయగల దిట్ట
  • ఓ చరిత్రకారుడు, సామాజిక మానవ శాస్త్రజ్ఞుడు : జ్ఞానపీఠ్ కమిటీ ప్రశంసలు

భారత దేశ సాహితీ పురస్కారాల్లో అత్యుత్తమమైన జ్ఞానపీఠ్ అవార్డు బెంగాలీ నవలా రచయిత అమితవ్ ఘోష్ కు దక్కింది. సాహిత్యంలో అత్యుత్తమ సేవలు అందించిన అభినవ్ ను ఈ ఏడాది జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ మేరకు జ్ఞానపీఠ్ కమిటీ ఓ ప్రకటన విడుదల చేశారు.

అమితవ్ ను ఓ చరిత్రకారుడిగా, సామాజిక మానవ శాస్త్రజ్ఞుడిగా అభివర్ణించిన జ్ఞానపీఠ్ నిర్వాహకులు, చరిత్రను ఆధునిక యుగానికి తగినట్టుగా నవలగా రాయడంలో ఘోష్ అందెవేసిన చెయ్యి అని ప్రశంసించారు. కాగా, ‘షాడో లైన్స్’, ‘ది గ్లాస్ ప్యాలెస్’, ‘ది హంగ్రీ టైడ్’, ‘రివర్ ఆఫ్ స్మోక్’, ‘ఫ్లడ్ ఆఫ్ ఫైర్’, ‘సీ ఆఫ్ పాపీస్’ తదితర రచనలు చేశారు. ‘ది గ్లాస్ ప్యాలెస్’, ‘సీ ఆఫ్ పాపీస్’ నవలలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

కాగా, 1956లో కోల్ కతాలో అమితవ్ జన్మించారు. 2006  లో రాసిన ‘ద సర్కిల్ ఆఫ్ రీజన్స్’ నవల ద్వారా సాహిత్య పాఠకులకు ఆయన ముందుకు వచ్చారు. భారత ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ఆయన అందుకున్నారు. ప్రస్తుతం న్యూయార్క్ లో ఆయన తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు.

ఇది నాకు అద్భుతమైన రోజు: అమితవ్

జ్ఞానపీఠ్ పురస్కారం తనకు దక్కడంపై అమితవ్ స్పందిస్తూ ఓ పోస్ట్ చేశారు. ఈ జాబితాలో తనకు చోటు దక్కుతుందని ఎన్నడూ అనుకోలేదని, ఈ పురస్కారానికి తనను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈరోజు తనకు అద్భుతమైన రోజుగా ఆయన అభివర్ణించారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News