Gujarath: 11 ఏళ్ల బాలికపై తొమ్మిదో తరగతి విద్యార్థి అత్యాచారం

  • ఇరుగు పొరుగు ఇళ్లల్లో నివాసం
  • పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం
  • మైనర్ కావడంతో అరెస్ట్ చెయ్యట్లేదు

బాలికపై ఓ బాలుడు అత్యాచారం చేసిన దారుణ ఘటన గుజరాత్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బనస్కంత జిల్లాలోని దంత గ్రామంలో 11 ఏళ్ల బాలికపై తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి బుధవారం సాయంత్రం అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనపై ఇన్‌స్పెక్టర్ గోస్వామి మాట్లాడుతూ.. బాధితురాలు, నిందితుడు ఇరుగుపొరుగు ఇళ్లలో నివసిస్తుంటారని తెలిపారు. బుధవారం బాలికను పొదల్లోకి తీసుకెళ్లిన నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడని.. దీనికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. నిందితుడు మైనర్ కావడంతో అతన్ని అరెస్ట్ చేయట్లేదని.. విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్టు గోస్వామి వెల్లడించారు.

Gujarath
Student
Goswamy
Banaskantha
Dantha
Police
  • Loading...

More Telugu News