Rana Daggubati: రానా కోసం జపాన్ నుంచి బాక్సుల్లో లేఖలు వచ్చాయి: శోభు యార్లగడ్డ

  • రానాకు సంబంధించిన పోస్టర్ విడుదల
  • బాక్సుల కొద్దీ పుట్టినరోజు కానుకలు
  • జపనీయుల ప్రేమకు ధన్యవాదాలు

నేడు కథానాయకుడు రానా దగ్గుబాటి పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. రామ్ చరణ్, అనుష్క, అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ తదితరులంతా రానాకు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆయన ‘ఎన్టీఆర్’ చిత్రంలో ఏపీ సీఎం చంద్రబాబు పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ చిత్రబృందం రానాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది.

‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ రానాకు ఆశ్చర్యపరిచే విషయం ఒకటి వెల్లడించారు. జపాన్ నుంచి భళ్లాల దేవుడి కోసం బాక్సుల కొద్దీ పుట్టినరోజు కానుకలు వచ్చాయని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘జపాన్‌ డిస్ట్రిబ్యూటర్‌ ఇవాళ ఆర్కాకు వచ్చారు. రానా కోసం అభిమానులు పంపిన 19 బాక్సుల లేఖలు, బహుమతులు ఇచ్చారు. జపాన్‌ వాసులు కురిపిస్తున్న ప్రేమకు మరోసారి ధన్యవాదాలు చెబుతున్నాం’ అని పేర్కొంటూ శోభు బాక్సుల ఫోటోల్ని షేర్ చేశారు. దీనికి రానా ‘వావ్‌.. థాంక్యూ’ అని రిప్లై ఇచ్చారు.

Rana Daggubati
Social Media
Japan
Chandrababu
shobhu Yarlagadda
  • Loading...

More Telugu News