India: భారత్ కు షాకిచ్చిన నేపాల్.. మన పెద్ద నోట్లను నిషేధిస్తూ ఆదేశాలు!

  • రూ.2 వేలు, రూ.500, రూ.200 నోట్లపై వేటు
  • రెండేళ్లుగా వీటిని గుర్తించని నేపాల్ సర్కారు
  • భారత పర్యాటకులకు ఇబ్బేందేనంటున్న నిపుణులు

నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ఇటీవలి కాలంలో చలామణిలోకి తీసుకొచ్చిన రూ.2,000, రూ.500, రూ.200 నోట్లపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. వీటిని నేపాల్ ప్రభుత్వం ఇప్పటివరకూ చట్టబద్ధం చేయకపోగా, తాజాగా నిషేధం విధించింది.

భారత్ కు చెందిన పర్యాటకులు భారీ సంఖ్యలో ఏటా నేపాల్ ను సందర్శిస్తూ ఉంటారు. దీనిని దృష్టిలో పెట్టుకునే భారత కరెన్సీని నేపాల్ ప్రభుత్వం అనుమతిస్తోంది. 2016 నవంబరు 8న రూ. 1000, రూ.500 విలువైన పెద్దనోట్లను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత భారత ప్రభుత్వం జారీచేసిన పెద్దనోట్లను నేపాల్ ఇప్పటివరకూ అధికారికంగా గుర్తించలేదు. నేపాల్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో భారత్ లో పనిచేసే నేపాలీలతో పాటు నేపాల్ కు వెళ్లే భారత పర్యాటకులకు ఇబ్బంది కలిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News