fisherman: మత్స్యకారుడిని చంపి తిన్న పులులు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-527be1d1b9c4c5f4850ebba2f871d9d1f4a7e485.jpg)
- గుజరాత్ లో దారుణ ఘటన
- అడవిలోని చెరువులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు
- మార్గమధ్యంలో దాడి చేసిన నాలుగు పులులు
చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడిని పులులు చంపి, తిన్న ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, గుజరద గ్రామానికి చెందిన రాం చుడాసమా (37) అనే మత్స్యకారుడు అడవిలో ఉన్న చెరువులో చేపల వేటకు ఒంటరిగా బయల్దేరాడు. మార్గమధ్యంలో అతనిపై నాలుగు పులులు దాడి చేసి, చంపి తిన్నాయి. అతని మృతదేహాన్ని అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో అటవీ గ్రామాల్లోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.