India: టాప్ లేచింది... త్వరత్వరగా మూడు వికెట్లు!

  • లంచ్ వరకూ వికెట్ నష్టపోని ఆసీస్
  • ఆపై బుమ్రా బాల్ తో పెవీలియన్ కు ఫించ్
  • ఉమేష్ యాదవ్ కు దొరికిన ఖవాజా

పెర్త్ లో నేడు ప్రారంభమైన రెండో టెస్టు తొలి రోజున లంచ్ విరామం వరకూ వికెట్ నష్టపోకుండా నిలిచిన ఆసీస్ ఆటగాళ్లు, ఆపై త్వరత్వరగా పెవీలియన్ దారి పట్టారు. తొలి వికెట్‌ కు సెంచ‌రీ భాగ‌స్వామ్యాన్ని అందించిన ఓపెనర్లతో పాటు ఖవాజా వికెట్ ను కూడా ఆసీస్ కోల్పోయింది.

112 ప‌రుగుల వద్ద ఫించ్ (50)ను బుమ్రా అవుట్ చేయగా, ఆపై వచ్చిన ఖ‌వాజా (5)ను ఉమేష్ యాద‌వ్ పెవీలియన్ కు పంపించాడు. ఆపై కాసేపటికే, 70 ప‌రుగుల‌తో క్రీజులో బలంగా నిలబడిన మరో ఓపెన‌ర్ హ‌రీస్ (70)ను హనుమ విహారి అవుట్ చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు కాగా, షాన్‌ మార్ష్ 8 పరుగులతో, హ్యాండ్స్ కాంబ్ 4 పరుగులతో ఆడుతున్నారు.

India
Australia
Test
Cricket
  • Loading...

More Telugu News