Chandrababu: త్వరలోనే లోకేష్ బండారం బట్టబయలు: లక్ష్మీపార్వతి

  • అవినీతి సొమ్ముతో తెలంగాణ ఓటర్లను కొనే ప్రయత్నం చేశారు
  • ఏపీలో అంతులేని అవినీతి జరుగుతోంది
  • త్వరలోనే చంద్రబాబు, లోకేష్ ల భాగోతం వెలుగులోకి వస్తుంది

ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల నందమూరి కుటుంబం మరోసారి మోసపోయిందని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. అవినీతి సొమ్ముతో తెలంగాణ ఓటర్లను కొనే ప్రయత్నం చేశారని... ఓటర్లు మాత్రం ఆయనకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారని చెప్పారు. యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీని గతంలో ఇటలీ దెయ్యంగా అభివర్ణించిన చంద్రబాబు... ఇప్పుడు దేవతగా కొలుస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులతో పాటు ప్రతి పథకంలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేల అక్రమాలకు హద్దు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇప్పటికే సుజనా చౌదరి, సీఎం రమేష్ ల బండారం బయట పడిందని... త్వరలోనే చంద్రబాబు, లోకేష్ ల భాగోతం వెలుగులోకి వస్తుందని అన్నారు.

Chandrababu
lakshmi parvathi
lokesh
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News