India: తండ్రి ‘బోఫోర్స్’లో దోచుకుంటే.. తల్లీకొడుకులు ‘అగస్టా’లో దండుకున్నారు!: కాంగ్రెస్ నేతలపై జీవీఎల్ ఫైర్

  • రాఫెల్ కేసులను కొట్టివేసిన సుప్రీంకోర్టు
  • అనుమానాస్పద అంశాలేవీ లేవని స్పష్టీకరణ
  • రాజీవ్, సోనియా, రాహుల్ పై జీవీఎల్ విమర్శలు

ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం కేంద్రం చేసుకున్న ఒప్పందంలో అనుమానాస్పదంగా ఏమీ లేదని ఈ రోజు సుప్రీంకోర్టు తేల్చింది. ఈ కేసులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. రాఫెల్ పై దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ట్విట్టర్ లో స్పందించారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ అబద్ధాల పుట్ట అని తాజాగా సుప్రీం తీర్పుతో రుజువయిందని తెలిపారు. బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణంలో రాహుల్ తండ్రి (రాజీవ్ గాంధీ) మధ్యవర్తిగా వ్యవహరిస్తే, తల్లీకొడుకులు (సోనియా-రాహుల్ గాంధీ) అగస్టా హెలికాప్లర్ట  ఒప్పందంలో భారీగా ముడుపులు అందుకున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీని దోషిగా నిలబెట్టేందుకు రాహుల్ శతవిధాలా ప్రయత్నించారని మండిపడ్డారు. తాజాగా రాఫెల్ కేసులో కోర్టు తీర్పు రాహుల్ గాంధీకి చెంపదెబ్బ లాంటిదని వ్యాఖ్యానించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News