telangna: టీఆర్ఎస్ రథసారథిగా కేటీఆర్.. గ్రీటింగ్స్ చెప్పిన అసదుద్దీన్ ఒవైసీ!

  • టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్
  • బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి
  • అభినందించిన మజ్లిస్ అధినేత 

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మాజీ మంత్రి కేటీఆర్ నియమితులైన సంగతి తెలిసిందే. అత్యంత నమ్మకస్తుడు, సమర్థుడు అయిన వ్యక్తికే తాను పార్టీ పగ్గాలు అప్పగించానని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి.

తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నియామకంపై మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కొత్త బాధ్యతలు అందుకున్న కేటీఆర్ కు అసద్ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ తన కుమారుడికి చాలా బరువైన బాధ్యతను అప్పగించారని వ్యాఖ్యానించారు. ఈ బాధ్యతలను కేటీఆర్ సక్రమంగా నిర్వర్తిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ మేరకు అసదుద్దీన్ ఒవైసీ ఈ రోజు ట్విట్టర్ లో స్పందించారు.

telangna
TRS
KTR
KCR
Twitter
MIM
Asaduddin Owaisi
wishes
  • Loading...

More Telugu News