Chandrababu: హార్ట్ ఎటాక్ తో చంద్రబాబు మేనల్లుడి మృతి!

  • నిన్న కేర్ ఆసుపత్రిలో చేరిన ఉదయ్ కుమార్
  • ఈ ఉదయం చికిత్స పొందుతూ మృతి
  • చంద్రబాబు సోదరి హైమవతి కుమారుడు ఉదయ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మేనల్లుడు ఉదయ్‌ కుమార్‌ ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 43 సంవత్సరాలు. నిన్న గుండెపోటుతో హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. ఉదయ్ కుమార్, చంద్రబాబు రెండో సోదరి హైమవతి కుమారుడు. ఉదయ్ కుమార్ మృతి వార్త తెలుసుకున్న చంద్రబాబు, అమరావతి నుంచి హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు. ఉదయ్ కుమార్ మృతి పట్ల పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు సంతాపం వెలిబుచ్చారు.

Chandrababu
Hymavati
Udaykumar
Heart Attack
  • Loading...

More Telugu News