Tara Chowdary: బావే దారుణంగా మోసం చేశాడు... పోలీసులను ఆశ్రయించిన నటి తారా చౌదరి

  • పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డ రాజ్ కుమార్
  • తొలుత అంగీకరించని తారా చౌదరి
  • ఇప్పుడు తాను కావాలంటే, మోసం చేస్తున్నాడని ఫిర్యాదు

పెళ్లి పేరిట తనను బావ వరసయ్యే చావ రాజ్ కుమార్ దారుణంగా మోసం చేశాడంటూ సినీ నటి తారా చౌదరి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కొన్ని సినిమాల్లో నటించిన తారా చౌదరి (31), తన ఆడియో టేపులు, వివాదాస్పద సంభాషణలతో టాలీవుడ్ లో కలకలం సృష్టించి పాప్యులర్ అయింది.

రాజ్ కుమార్, ఆయన సోదరి సుజాతతో తారా చౌదరికి సత్సంబంధాలుండేవి. తన సోదరుడిని పెళ్లి చేసుకోవాలని గతంలో సుజాత కోరగా, తార నిరాకరించింది. అతనికి పెళ్లి జరిగిందన్న విషయాన్ని గుర్తు చేస్తే, మొదటి భార్యకు విడాకులు ఇవ్వనున్నాడని సుజాత చెప్పింది. అయినా పెళ్లికి అంగీకరించని తారా చౌదరి, తన మకాంను విజయవాడకు మార్చగా, రాజ్‌ కుమార్‌ అక్కడికి వెళ్లి, తాను తారాచౌదరి భర్తనని చెప్పుకున్నాడు. తన భర్తగా నలుగురిలో రాజ్ కుమార్ పేరు తెచ్చుకోవడంతో తారా చౌదరి అతనితోనే పెళ్లికి సిద్ధమైంది. కానీ, ఇప్పుడు రాజ్ కుమార్ తప్పించుకుంటున్నాడట. తానెంత ఒత్తిడి చేసినా పెళ్లి చేసుకోబోనని మోసం చేస్తున్నాడంటూ, ఆమె పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Tara Chowdary
Actress
Raj Kumar
Marriage
Hyderabad
Police
  • Loading...

More Telugu News