Sabita Indra reddy: ఆ వార్తల్లో నిజం లేదు.. అది టీఆర్ఎస్ దుష్ప్రచారం: సబితా ఇంద్రారెడ్డి

  • సబిత టీఆర్ఎస్‌లో చేరబోతున్నారంటూ వార్త హల్‌చల్
  • కొట్టిపడేసిన ఎమ్మెల్యే
  • పదవులకు అమ్ముడుపోబోమన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్‌లో చేరబోతున్నారంటూ గురువారం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. ఇది తన వరకు చేరడంతో సబిత స్పందించారు. తాను పార్టీని వీడడం లేదని, ఇదంతా టీఆర్ఎస్ దుష్ప్రచారమేనని మండిపడ్డారు.

మరోవైపు కొత్తగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యలు కూడా టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో స్పందించిన వీరు తాము పార్టీని వీడడం లేదని స్పష్టం చేశారు. ప్రాణమున్నంత వరకు కాంగ్రెస్‌లోనే ఉంటామని, పదవులకు ఆశపడి అమ్ముడుపోబోమని స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్‌లో చేరబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ ఖండించింది. 

Sabita Indra reddy
Congress
Telangana
TRS
  • Loading...

More Telugu News