India: ‘జడ్జి తీర్పు వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ లా ఉంది’.. హిందూ రాజ్యం వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఒవైసీ!

  • భారత్ ను హిందూ దేశంగా మర్చాలి
  • తీర్పులో పేర్కొన్న జస్టిస్ సేన్
  •  జడ్జి వ్యాఖ్యలను తప్పుపట్టిన అసద్

భారత్ ను జనాభా సంఖ్య ఆధారంగా ఇప్పటికే హిందూ దేశంగా మార్చి ఉండాల్సిందని మేఘాలయ హైకోర్టు జడ్జి జస్టిస్ సేన్ వ్యాఖ్యానించడంపై మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. జడ్జీ సేన్ ఇచ్చిన తీర్పు వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ లాగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. చట్టం, రాజ్యాంగం గురించి తెలిసిన వ్యక్తులు రాసిన తీర్పులా అది కనిపించడం లేదని విమర్శించారు. ఈ రోజు ట్విట్టర్ లో ఒవైసీ స్పందిస్తూ..‘జడ్జి గారూ ఇంకో పనిచేయాలి. మిత్రులారా.. అని పిలిచేవారి భజన చేయడం కాకుండా తాను జడ్జి అవడానికి కారణమైన రాజ్యాంగాన్ని ఓసారి చదవాలి. జస్టిస్ సేన్ ఇచ్చిన తీర్పు నిజంగా రాజ్యాంగం, చట్టం తెలిసిన వ్యక్తి రాసినదానికంటే ఫార్వర్డ్ చేసిన ఓ వాట్సాప్ మెసేజ్ లాగా కనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News