Tollywood: పొగరాయుళ్లకు హీరోయిన్ అదా శర్మ వార్నింగ్.. సైడ్ ఎఫెక్ట్స్ పై వీడియో విడుదల!

  • ట్విట్టర్ లో పోస్ట్ చేసిన నటి
  • బడ్జెట్ తక్కువగా ఉందని వ్యాఖ్య
  • ఆస్కార్ వాళ్లు చూస్తున్నారా? అని ట్వీట్

పొగతాగడం ప్రమాదకరమని తెలిసినా చాలామంది ఆ అలవాటును వదులుకోలేరు. అందుకే సెలబ్రిటీల చేత ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. తమ అభిమాన తారల చేత చెప్పిస్తే అయినా కనీసం పొగరాయుళ్లు కొంచెం వెనక్కు తగ్గుతారన్న ఆశతో అధికారులు ఇలాంటి  ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా హీరోయిన్ అదా శర్మ స్మోకింగ్ కు వ్యతిరేకంగా ఓ వీడియోను రూపొందించింది.

‘సో.. నేను పొగతాగటానికి వ్యతిరేకంగా సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. పొగ తాగడం ప్రమాదకరం. మీరు పొగతాగితే చివరికి ఈ వీడియోలో నాలాగే అయిపోతారు. కాబట్టి తాగకండి. నా నటనను ఆస్కార్ కమిటీ వాళ్లు చూస్తున్నారా? లో బడ్జెట్ కారణంగానే రెండు చెవులకు కమ్మలు పెట్టుకోలేకపోయా’ అంటూ ట్వీట్ చేసింది. అదా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోను మీరూ చూసేయండి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News