Telangana: కేసీఆర్ అనే నేను.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన టీఆర్ఎస్ అధినేత!

  • ముహూర్తం మేరకు 1.25 గంటలకు ప్రమాణం
  • మంత్రిగా మొహమూద్ అలీ బాధ్యతలు
  • జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో మార్మోగిన వేదిక

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఈ రోజు నిర్ణయించిన ముహూర్తం ప్రకారమే మధ్యాహ్నం 1.25 గంటలకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్.. కేసీఆర్ చేత ప్రమాణం చేయించారు. కేసీఆర్ దైవ సాక్షిగా ప్రమాణం చేయగానే సభా ప్రాంగణమంతా జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లింది.

ప్రమాణస్వీకారం పూర్తవగానే కేసీఆర్ వేదికపైనే ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సంతకం పెట్టారు. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం మొహమూద్ అలీ తెలంగాణ మంత్రిగా అల్లాహ్ సాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రభుత్వ రహస్యాలను కాపాడతానని ప్రమాణం చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు టీఆర్ఎస్ నూతన ఎమ్మెల్యేలు, నేతలు భారీగా తరలివచ్చారు.

Telangana
KCR
RAJBHAVAN
NARASIMHAN
Chief Minister
OATH TAKING
  • Loading...

More Telugu News