nakka anand babu: దమ్ముంటే ఏపీలో ప్రచారం చేయండి: కేసీఆర్ కు మంత్రి నక్కా ఆనందబాబు సవాల్

  • కేసీఆర్ కోసమే తెలంగాణలో వైసీపీ పోటీ చేయలేదు
  • వైసీపీ, జనసేనలను కేసీఆర్ నడిపిస్తున్నారు
  • డబ్బుతో గెలిచిన కేసీఆర్ కు అభినందనలు

ఏపీలో కూడా అడుగుపెడతానని, విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడతానని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు స్పందించారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కు దమ్ముంటే ఏపీలో ప్రచారం చేయాలని సవాల్ విసిరారు.

కేసీఆర్ కోసమే తెలంగాణలో వైసీపీ పోటీ చేయలేదని విమర్శించారు. జనసేన, వైసీపీ, బీజేపీ, ఎంఐఎంలను కేసీఆర్ నడిపిస్తున్నారని ఆరోపించారు. ఏపీలోని విపక్షాలు కేసీఆర్ తో ఎలా కలుస్తాయో చూస్తామని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బుతో గెలిచిన కేసీఆర్ కు అభినందనలు తెలుపుతున్నామని చెప్పారు. 

nakka anand babu
kcr
Telugudesam
TRS
YSRCP
janasena
mim
bjp
  • Loading...

More Telugu News