Tamilnadu: మహిళా కానిస్టేబుల్ పై కన్నేసిన ఏఎస్ఐ.. బూటుతో రెండు చెంపలు వాయించిన యువతి!

  • తమిళనాడులోని తిరుచ్చిలో ఘటన
  • కానిస్టేబుల్ ను వేధించిన బాలసుబ్రమణి
  • సస్పెండ్ చేసిన పోలీస్ ఉన్నతాధికారులు

ప్రజలను కాపాడాల్సిన పోలీస్ అధికారి దారితప్పాడు. స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో భయాందోళనలకు గురైన యువతి స్టేషన్ నుంచి పారిపోయింది. అనంతరం మరుసటి రోజు జిల్లా ఎస్పీకి సాక్ష్యాలతో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో చోటుచేసుకుంది.

తిరుచ్చిలోని సోమరసంపేట పోలీస్ స్టేషన్ లో బాలసుబ్రమణి (50) ఏఎస్‌ఐగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి గస్తీకి వెళ్లొచ్చిన ఆయన అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ తో అసభ్యంగా మాట్లాడాడు. దీంతో సదరు యువతి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయేందుకు యత్నించింది. వెంటనే ఆమెను అడ్డుకున్న బాలసుబ్రమణి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనతో సహనం కోల్పోయిన యువత కాలి బూటు తీసి ఏఎస్ఐ రెండు చెంపలు వాయించింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది.

ఎంతసేపయినా మహిళా కానిస్టేబుల్ వెనక్కు రాకపోవడంతో బాలసుబ్రమణి ఇంటికి వెళ్లిపోయాడు. అతను అటు వెళ్లగానే స్టేషన్ లోకి వచ్చిన యువతి సీసీటీవీ కెమెరాల్లో తనను వేధించిన వీడియోను పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకుని వెళ్లిపోయింది. మరుసటి రోజు జిల్లా ఎస్పీకి సాక్ష్యాలతో సహా రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు బాలసుబ్రమణిని వెంటనే సస్పెండ్ చేశారు. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Tamilnadu
Police
sexual harrasment
asi
woman
constable
suspend
  • Loading...

More Telugu News