reliance: తిరుపతి వద్ద రిలయన్స్ సెజ్ కు రంగం సిద్ధం

  • 150 ఎకరాల విస్తీర్ణంలో రిలయన్స్ ఎలక్ట్రానిక్ సెజ్
  • వచ్చే నెలలో శంకుస్థాపన
  • రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్న రిలయన్స్

ఏపీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. తిరుపతి సమీపంలో 150 ఎకరాల విస్తీర్ణంలో 'రిలయన్స్ ఎలక్ట్రానిక్ సెజ్'ను ఏర్పాటు చేయనుంది. వచ్చే నెల ఈ సెజ్ కు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, మంత్రి లోకేష్ తదితరులు పాల్గొననున్నారు. ఈ సెజ్ లో రిలయన్స్ దాదాపు రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు పెడుతోంది. జియో ఫోన్లు, సెట్ టాప్ బాక్స్ లతో పాటు రోజుకు దాదాపు 10 లక్షల వస్తువులను ఇక్కడ ఉత్పత్తి చేయబోతున్నారు. 

reliance
electronic sez
ap
tirupati
mukhesh ambani
Chandrababu
  • Loading...

More Telugu News