Telangana: మా కార్యకర్తల జోలికి వచ్చారో తాట తీస్తా.. కవ్విస్తే ఊరుకోను!: జలగం వెంకట్రావు వార్నింగ్

  • ఎన్నికలు అయ్యేంతవరకే రాజకీయాలు
  • కొత్తగూడెంలో అభివృద్ధిని ఆగనివ్వం
  • పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు

ఎన్నికలు జరిగినంత వరకే రాజకీయాలు చేయాలనీ, ఆ తర్వాత తమ కార్యకర్తలను పోలీస్ కేసుల్లో ఇరికించాలని చూస్తే తాటతీస్తానని మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావు హెచ్చరించారు. ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకోబోనని స్పష్టం చేశారు. పాల్వంచలోని తన కార్యాలయంలో అనుచరులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వెంకట్రావు మాట్లాడారు.

కొత్తగూడెంలో అధికారంలోకి రాలేదని కార్యకర్తలు ఆందోళన చెందవద్దని రాష్ట్రంలో తామే అధికారంలో ఉన్నామని ధైర్యం చెప్పారు. కొత్తగూడెంలో తన హయాంలో జరిగిన అభివృద్ధిని ఆగనివ్వబోనని స్పష్టం చేశారు. ఎన్నికలు అన్నాక గెలుపోటములు సహజమనీ, కార్యకర్తలు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Telangana
Telangana Assembly Results
kottagudem
jalagam
venkatarao
  • Loading...

More Telugu News