Chandrababu: తెలంగాణలో వేలు పెట్టి తప్పు చేశావు చంద్రబాబూ..: ముద్రగడ

  • సరిదిద్దుకోలేని తప్పు చేసిన చంద్రబాబు
  • సెటిలర్లు కూడా చంద్రబాబును నమ్మలేదు
  • పక్క రాష్ట్రాలపై కన్నేయడం మానేయాలని సలహా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వేలు పెట్టి సరిదిద్దుకోలేని తప్పు చేశారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణ ప్రజలతో పాటు అక్కడి సెటిలర్స్ కూడా చంద్రబాబును నమ్మడం లేదన్న విషయం ఈ ఎన్నికల ఫలితాలతో రుజువైందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రజల నుంచి దోచుకున్న డబ్బును తెలంగాణ ఎన్నికల్లో ఆయన విచ్చలవిడిగా ఖర్చు చేశారని, అయినా ప్రజలు చీకొట్టారని విమర్శించారు. ఇకనైనా ఆయన పక్క రాష్ట్రాలపై కన్నేయకుండా, ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. ఒడిశాలో తెలుగుదేశం పోటీ చేస్తుందని వచ్చిన వార్తలపై స్పందిస్తూ, అక్కడ కూడా చంద్రబాబును ఆదరించేవారుండరని జోస్యం చెప్పారు.

Chandrababu
Mudragada
Padmanabham
Telugudesam
Telangana
  • Loading...

More Telugu News