Andhra Pradesh: ఏపీ సచివాలయం అంతటా నెగటివ్ వైబ్రేషన్స్.. లోకేశ్ వల్లే ప్రభుత్వం నడుస్తోంది!: జోతిష్యుడి సంచలన వ్యాఖ్యలు

  • చంద్రబాబు జాతకం అస్సలు బాగోలేదు
  • సచివాలయంలో మార్పులు చేయాలి
  • లోకేశ్ కంటే కేటీఆర్ పవర్ ఫుల్ గా ఉన్నారు

వెలగపూడిలోని ఏపీ సచివాలయం మొత్తం నెగటివ్ వైబ్రేషన్స్ నెలకొని ఉందని హస్తసాముద్రిక నిపుణులు, జ్యోతిష్యుడు మాండ్రు నారాయణ రమణారావు తెలిపారు. దీని కారణంగా సచివాలయంలోని చిన్నా, పెద్ద ఉద్యోగులు అందరూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి జాతకం ఇప్పుడు అస్సలు బాగోలేదని వెల్లడించారు.

మంత్రి నారా లోకేశ్ జాతకం ఇప్పుడు చాలా బాగుందనీ, ఆయన వల్లే ప్రభుత్వం నడుస్తోందని కితాబిచ్చారు. ఏపీ సచివాలయంలో మార్పులు చేస్తే చంద్రబాబుకు రాజకీయంగా, ఆరోగ్యపరంగా మంచిదని సూచించారు. నారా లోకేశ్ తో పోల్చుకుంటే తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత కేటీఆర్ జాతకం చాలా బాగుందని నారాయణ రమణారావు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో తాను చంద్రబాబును కలుసుకోలేదనీ, ఆయన పరిస్థితి ఏమిటో చూశాకే చెప్పగలనని స్పష్టం చేశారు.

Andhra Pradesh
Telangana
Chandrababu
Nara Lokesh
KTR
astrology
  • Loading...

More Telugu News