Pawan Kalyan: రాజకీయాల్లో నాకు ఆయనే స్ఫూర్తి!: పవన్ కల్యాణ్

  • అమెరికాలో జనసేనాని పర్యటన
  • మార్టిన్ లూథర్ కింగ్ స్మారకం సందర్శన
  • ట్విట్టర్ లో స్పందించిన పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ తన అభిమానులు, మద్దతుదారులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో పవన్ సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా ఏపీలో వెనుకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై జనసేనాని పలువురు పెట్టుబడిదారులతో చర్చించారు. కాగా, అమెరికా టూర్ లో భాగంగా పవన్ అగ్రరాజ్యంలో జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ స్మారకాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

అనంతరం స్పందిస్తూ..‘కష్టాలను ఓ నాయకుడు ఎలా ఎదుర్కోవాలో, లక్ష్యం దిశగా ధైర్యంగా ఎలా సాగాలో అర్థం చేసుకునేందుకు నేను ఆయన(మార్టిన్ లూథర్ కింగ్) ఆత్మకథను తరచుగా చదువుతుంటాను’ అని ట్వీట్ చేశారు. తనతో పాటు పలువురికి మార్టిన్ లూథర్ కింగ్ స్ఫూర్తిగా నిలిచారని వ్యాఖ్యానించారు.

Pawan Kalyan
Jana Sena
USA
tour
Twitter
martian luther king jr
  • Loading...

More Telugu News