Mukesh Ambani: నభూతో నభవిష్యతి... ఈశా పెళ్లి తరువాత హారతి వీడియో!

- ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు
- వైభవంగా సాగిన ఈశా అంబానీ వివాహం
- శ్రీకృష్ణునికి హారతి కార్యక్రమం అదుర్స్
ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు... విందు వినోదాలు, సరదా సంతోషాలు...!
సాధారణ పెళ్లిళ్లే ఓ రేంజ్ లో జరుగుతుంటే, ఇండియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ ఇంట పెళ్లంటే...!
ఊహించిన స్థాయిని మించి తన కుమార్తె పెళ్లిని జరిపించారు ముఖేష్. విదేశీ అతిథులు, సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు, వేలాది మందిగా హాజరైన ఈ వివాహ వేడుక సందర్భంగా శ్రీ కృష్ణునికి హారతి ఇచ్చే కార్యక్రమం నభూతో న భవిష్యతి అనే రేంజ్ లో సాగింది. ఈ హారతి వీడియోను మీడియా కోసం రిలయన్స్ విడుదల చేసింది.
