Telangana: ఎన్నికలు ముగిశాయి కదా, ఇక నాకు సెక్యూరిటీ అక్కర్లేదు: రేవంత్ రెడ్డి

  • ముగిసిన తెలంగాణ ఎన్నికలు
  • తనకు భద్రత వద్దన్న కాంగ్రెస్ నేత
  • మీడియాతో మాట్లాడిన వికారాబాద్ ఎస్పీ

టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన భద్రతా సిబ్బందిని వెనక్కు పంపారు. తెలంగాణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని రేవంత్ రెడ్డి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయనకు కల్పించిన 4 ప్లస్ 4 భద్రతను అధికారులు ఉపసంహరించుకున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై వికారాబాద్ జిల్లా ఎస్పీ అవినాశ్ మెహంతీ స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి స్వయంగా తనకు భద్రత వద్దని చెప్పారని తెలిపారు. హైకోర్టు కూడా ఎన్నికలు పూర్తయ్యేవరకే రేవంత్ కు భద్రత కల్పించాలని ఆదేశించిందన్నారు. రేవంత్ నిర్ణయంతో తాము భద్రతను వెనక్కు తీసుకున్నామని స్పష్టం చేశారు.

Telangana
Telangana Assembly Results
Revanth Reddy
Congress
security
Police
  • Loading...

More Telugu News