TTD: నేటి రాత్రి 9 గంటల నుంచి టీటీడీ వెబ్‌సైట్ మూత

  • రాత్రి 9 గంటల నుంచి 12 వరకు సేవల నిలిపివేత
  • సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కోసమే
  • సహకరించాలని విజ్ఞప్తి

నేటి రాత్రి 9 గంటల నుంచి మూడు గంటలపాటు అంటే అర్ధరాత్రి 12 గంటల వరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెబ్‌సైట్ సేవలు నిలిచిపోనున్నాయి. టీటీడీ బుధవారం ఈ విషయాన్ని వెల్లడిస్తూ అసౌకర్యానికి భక్తులు మన్నించాలని, మూడు గంటలపాటు తమకు సహకరించాలని కోరింది. శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకునే ‘టీటీడీ సేవా ఆన్‌లైన్’తోపాటు సర్వ, దివ్య దర్శనం టైమ్ స్లాట్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లను అప్‌డేట్ చేసేందుకే సైట్ సేవలను తాత్కాలికంగా నిలివేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. గురువారం అర్ధ రాత్రి దాటాక తిరిగి సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.

TTD
Online services
Tirupati
Tirumala
Web site
  • Loading...

More Telugu News