Chandrababu: ప్రత్యేక హోదాపై చంద్రబాబుకే క్లారిటీ లేదు!: కేసీఆర్ ఎద్దేవా

  • ప్రత్యేక హోదా సంజీవినా? దాని వల్ల ఏమొస్తుందన్నారు
  • కాంగ్రెస్, టీడీపీలు నిరుద్యోగులను మోసం చేశాయి
  • నేను కఠినంగా ఉండటాన్ని అప్రజాస్వామ్యం అనుకుంటారు!

ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబుకే క్లారిటీ లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదా సంజీవినా? అని చంద్రబాబు ప్రశ్నించారని, హోదా వల్ల ఏం వస్తుందని ఆయనే అన్నారని విమర్శించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ పరిపాలనపై ఆయన విమర్శలు చేశారు. అరవై ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయని, అబద్ధాలు చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కఠినంగా ఉంటాడని, దాన్ని కొంతమంది అప్రజాస్వామ్యం అనుకుంటారని, తాను కఠినంగా లేకపోతే సరైన నిర్ణయం తీసుకోలేమని చెప్పారు.

Chandrababu
kcr
Telangana
Andhra Pradesh
special status
  • Loading...

More Telugu News