kcr: మా ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే 'రైతుబంధు' దేశమంతటా అమలు చేస్తాం: కేసీఆర్

  • ఎంత పెట్టుబడి పెట్టాలో స్పష్టమైన ఆలోచన ఉంది
  • సుమారు మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల అవుతుంది
  • ఇంత పెద్ద దేశంలో మైనార్టీల బడ్జెట్ నాలుగు వేల కోట్లా!  

కొత్త జాతీయ కూటమి పేరు ఇంకా పెట్టలేదని, మేము ఏర్పాటు చేసే ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే 'రైతుబంధు' పథకాన్ని దేశమంతటా అమలు చేస్తామని కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా ఈ పథకం అమలు చేయాలంటే ఎంత పెట్టుబడి అవుతుందన్న విషయమై తనకు స్పష్టమైన ఆలోచన ఉందని, సుమారు మూడు నుంచి నాలుగు లక్షల కోట్లు అవుతుందని అన్నారు.

మైనార్టీల విషయంలో కేంద్ర ప్రభుత్వం పని తీరుపైనా ఆయన నిప్పులు చెరిగారు. ఇంత పెద్ద దేశంలో మైనార్టీల బడ్జెట్ నాలుగు వేల కోట్ల రూపాయలేనా? అని విమర్శించారు. తెలంగాణలో మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతో చేసిందని, దేశ వ్యాప్తంగా ఉన్న వారి సంక్షేమం కోసం కృషి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.

kcr
TRS
Telangana bahavan
federal front
  • Loading...

More Telugu News