TRS: టీఆర్ఎస్ఎల్సీ నేతగా నన్ను ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు: కేసీఆర్

  • ఈసీ అధికారికంగా గెజిట్ ప్రకటన చేయాలి
  • రేపటికి ఈ ప్రకటన రావాలి
  • రాని పక్షంలో నాతో పాటు మరొకరు ప్రమాణ స్వీకారం చేస్తారు

టీఆర్ఎస్ఎల్సీ నేతగా తనను ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కేసీఆర్ అన్నారు. తెలంగాణభవన్ లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ అధికారికంగా గెజిట్ ప్రకటన చేయాలని, రేపటికి ఈ ప్రకటన రాకపోతే తనతో పాటు మరొకరు   ప్రమాణస్వీకారం చేస్తారని స్పష్టం చేశారు

ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల గురించి ఆయన ప్రస్తావిస్తూ, రాష్ట్ర, జిల్లా స్థాయి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు అన్ని రకాలుగా మేలు చేస్తామని, జర్నలిస్టుల సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.

TRS
lp leader
kcr
journalists
welfafe
  • Loading...

More Telugu News