vijay devarakonda: 'హీరో'గా విజయ్ దేవరకొండ!

  • 'డియర్ కామ్రేడ్'తో బిజీగా విజయ్ దేవరకొండ 
  • మైత్రీ మూవీ మేకర్స్ కి గ్రీన్ సిగ్నల్ 
  • త్వరలోనే పూర్తి వివరాలు  

యూత్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇటు అబ్బాయిలు .. అటు అమ్మాయిలు కూడా ఆయన సినిమాలకి ఎగబడిపోతున్నారు. ఈ క్రేజ్ కారణంగా ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. ప్రస్తుతం ఆయన 'డియర్ కామ్రేడ్' సినిమా షూటింగుతో బిజీగా వున్నాడు. ఆ తరువాత ఆయనతో సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద బ్యానర్లు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఆ బ్యానర్లలో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. ఈ బ్యానర్లో ఒక సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి 'హీరో' అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారని సమాచారం. గతంలో చిరంజీవి కథానాయకుడిగా 'హీరో' టైటిల్ తో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా చిరంజీవి హీరోయిజాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. అలాగే విజయ్ దేవరకొండకి గల క్రేజ్ ను కూడా 'హీరో' సినిమా మరోస్థాయికి తీసుకెళుతుందేమో చూడాలి. 

  • Loading...

More Telugu News