టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక
- కేసీఆర్ ని ఎన్నుకున్న 88 మంది ఎమ్మెల్యేలు
- కొద్దిసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లనున్న కేసీఆర్
- తీర్మాన ప్రతిని గవర్నర్ కు అందజేయనున్న కేసీఆర్
కాగా, రేపు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్, మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనే అంశం ఈ సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశముంది. ప్రొటెం స్పీకర్ గా రెడ్యా నాయక్ ను నియమించాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది.