kcr: కేసీఆర్ గిఫ్ట్ ఇస్తే చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారు: సబ్బం హరి

  • చంద్రబాబు గిఫ్ట్ ఇస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు
  • వైసీపీ, జనసేనల మధ్య దూరం పెరుగుతోంది
  • ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా

ఏపీకి చంద్రబాబే మరోసారి ముఖ్యమంత్రి అవుతారని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును ఓడించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని చెప్పారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలపై సబ్బం హరి స్పందించారు. చంద్రబాబు గిఫ్ట్ ఇస్తే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారని... కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తే చంద్రబాబు కూడా మరోసారి సీఎం అవుతారని చెప్పారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నానని... ఏ పార్టీలో చేరతాననే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ లు కలిస్తే చంద్రబాబుకు కష్టమేనని... అయితే, ఆ రెండు పార్టీల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోందని చెప్పారు.

kcr
Chandrababu
sabbam hari
jagan
Pawan Kalyan
Telugudesam
TRS
janasena
YSRCP
  • Loading...

More Telugu News