Rajasthan: రాజస్థాన్‌ అసెంబ్లీ స్పీకర్‌కు రికార్డు మెజార్టీ... ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపు

  • 74,542 ఓట్ల భారీ తేడాతో విజయం
  • గత ఎన్నికల కంటే దాదాపు 30 వేల ఓట్లు అధికం
  • అసెంబ్లీలో సీనియర్‌ సభ్యునిగా గుర్తింపు

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ మట్టి కరిచినా ఆ పార్టీ సీనియర్‌ శాసన సభ్యుడు, స్పీకర్‌ కైలాశ్‌ మేఘవాల్‌ భారీ ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డు నెలకొల్పారు. ఎనభై నాలుగేళ్ల కైలాశ్‌ అవివాహితుడు. తాజా ఎన్నికల్లో షాపురా నియోజక వర్గం నుంచి పోటీ చేసిన కైలాశ్‌ తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి మహావీర్‌ ప్రసాద్‌పై 74,542 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి కైలాశ్‌ పోటీ చేశారు. అప్పట్లో 43,666 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, ఈసారి అదనంగా మరో 30 వేల ఓట్ల వరకు సాధించడం గమనార్హం. ఉదయ్‌పూర్‌లో 1934 మార్చి 22న జన్మించిన కైలాశ్‌ మేఘవాల్‌ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పటి వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు ఎంపీగా పనిచేశారు. తాజాగా ఆరోసారి శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పలు కీలక పదవులు నిర్వహించారు.

  • Loading...

More Telugu News