Nalgonda District: తలపై రాళ్లతో మోది యువకుని హత్య!

  • నల్గొండ జిల్లా కేంద్రంలో రైలుట్రాక్‌ పక్కన పడివున్న మృతదేహం
  • హతుడిని వద్దిపట్ల గ్రామవాసిగా గుర్తింపు 
  • ఈ తెల్లవారుజామున జరిగిన ఘటన 

నల్గొండ జిల్లా కేంద్రంలో నేటి తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడి తలపై రాళ్లతో మోది హత్య చేశారు. మృతుడిని పి.ఎ.పల్లి మండలం వద్దిపట్ల గ్రామానికి చెందిన రమావత్‌బాలు (34)గా గుర్తించారు. హైదరాబాద్‌ రోడ్డులో ఉన్న రైల్వేట్రాక్‌ సమీపంలో ఈ యువకుడిని హత్య చేసి పడేశారు. అయితే రమావత్‌ బాలును వేరొక ప్రాంతంలో హత్య చేసి రైలు ట్రాక్‌ పక్కన పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న నల్గొండ సీఐ మహబూబ్‌ భాషా ఆధ్వర్యంలో పోలీసు బృందాలు, క్లూస్‌టీం, డాగ్‌ స్వ్కాడ్‌ ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరించాయి.

Nalgonda District
p.a.palli mandal
youth murder
  • Loading...

More Telugu News