shashi tharoor: బీజేపీకి ప్రజలు ట్రిపుల్ తలాక్ చెప్పారు: శశిథరూర్ ఎద్దేవా

  • మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘన విజయం
  • బీజేపీకి ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారన్న థరూర్
  • అరుణ్ జైట్లీ వ్యాఖ్యలను గుర్తు చేసిన మాజీ మంత్రి

వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ బోల్తా పడింది. ఏ ఒక్క రాష్ట్రంలోనూ విజయాన్ని అందుకోలేకపోయింది. అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో తిరుగులేని విజయాన్ని అందుకుంది. బీజేపీ ఓటమిపై కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందించారు.

బీజేపీ అంతగా విచారించాల్సింది ఏమీ లేదని, ఓటర్లు ఆ పార్టీకి ట్రిపుల్ తలాక్ చెప్పారని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండడంతో అంతకుముందు చేసిన ట్వీట్‌లో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలను ఉదహరించారు.  ‘‘దేశానికి శుభ దినం. దేశాన్ని మోసం చేసే వారు దెబ్బలు తినకుండా ఉండడం అసాధ్యం’’ అన్న అరుణ్ జైట్లీ వ్యాఖ్యలను శశిథరూర్ గుర్తుచేశారు.

shashi tharoor
Congress
BJP
Arun Jaitly
  • Loading...

More Telugu News