Ram Temple: బీజేపీ అందుకే ఓడింది.. ఆ పార్టీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

  • బీజేపీ ఓటమిని ముందే ఊహించా
  • అభివృద్ది హామీని ప్రభుత్వం మర్చిపోయింది
  • నగరాల పేర్ల మార్పు, విగ్రహాల ఏర్పాటుపైనే దృష్టి పెట్టింది

ఐదు రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణం ఏమిటో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ కాకడే  చెప్పేశారు. చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో బీజేపీ ఓటమిని తాను ముందే ఊహించానని, అయితే మరీ ఇంత ఘోరమైన ఫలితాలు వస్తాయని మాత్రం అస్సలు ఊహించలేదన్నారు. మంగళవారం  ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ‌లలో ఓటమి తప్పదని తనకు ముందే తెలుసని, కానీ మధ్యప్రదేశ్‌లలోనూ కాంగ్రెస్ పైచేయి సాధించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. అభివృద్ధి చేస్తామన్న హామీతో 2014లో మోదీ అధికారంలోకి వచ్చారని, కానీ పార్టీ ఇప్పుడా హామీని మర్చిపోయిందని సొంత పార్టీ పైనే విమర్శలు చేశారు. రామ మందిర నిర్మాణం, విగ్రహాల నిర్మాణం, నగరాల పేర్ల మార్పుపైనే పార్టీ దృష్టి సారించిందని, ఈ ఎన్నికల్లో అదే కొంప ముంచిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ram Temple
Name Changing
Madhya Pradesh
Ram temple
Sanjay kakade
  • Loading...

More Telugu News