Andhra Pradesh: ఏపీలో కేసీఆర్ అభిమానుల సంబరాలు .. కేక్ కట్ చేసిన వైనం!

  • గుంటూరు జిల్లా తెనాలిలో సంబరాలు
  • కేక్ కట్ చేసిన కేసీఆర్ ఫౌండేషన్ 
  • కేసీఆర్ నిజాయతీ గల నేతని ప్రశంసలు

తెలంగాణలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పరస్పరం అభినందనలు తెలుపుకుని, స్వీట్లు పంచుకున్నారు. ఇదే కోవలో తెలంగాణలోనే కాకుండా ఏపీలో ఉన్న కేసీఆర్ అభిమానులూ సంబరాలు చేసుకోవడం గమనార్హం.

గుంటూరు జిల్లా తెనాలిలో కేసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో కేక్ కోసి, తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ అభిమానులు పరస్పరం రంగులు చల్లుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు షేక్ ఖాదిర్ మాట్లాడుతూ, కేసీఆర్ తనను నమ్ముకున్న ప్రజలకు మేలు చేయడం వల్లే ఆ పార్టీకి ప్రజలు మరోసారి పట్టం కట్టారని అన్నారు. కేసీఆర్ నిజాయతీ గల నేత అని ప్రశంసించారు.

Andhra Pradesh
kcr
tenali
kcr foundation
  • Loading...

More Telugu News