Telangana: తెలంగాణలో పూర్తయిన ఓట్ల లెక్కింపు.. పూర్తి ఫలితాల వెల్లడి

  • 88 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం
  • 19 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్
  • ఖాతా కూడా తెరవని టీజేఎస్

తీవ్ర ఉత్కంఠ రేపిన ఓట్ల లెక్కింపు నేటి సాయంత్రంతో పూర్తయింది. ఈ ఎన్నికల్లో కారు జోరు కొనసాగించింది. 119 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల లెక్కింపులో టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కూటమికి చెందిన హేమాహేమీ నేతలు ఓటమి పాలయ్యారు.

కాంగ్రెస్ 19, ఎంఐఎం 7, టీడీపీ 2, బీజేపీ 1, ఇతరులు రెండు చోట్లకు పరిమితమయ్యారు. టీఆర్ఎస్ నుంచి కూడా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సభాపతి మధుసూదనాచారి, చందూలాల్‌ ఓటమి పాలయ్యారు. ఇక తెలంగాణ జన సమితి ఖాతా కూడా తెరవకపోవడం విశేషం.

Telangana
TRS
KCR
Tummala Nageswara Rao
Madhusudhana chari
Chandulal
  • Loading...

More Telugu News