Somireddy Chandramohan Reddy: టీఆర్ఎస్ పార్టీ కోట్లాది రూపాయలు కుమ్మరించి రాజకీయం చేసింది: ఏపీ మంత్రులు

  • ఇంతటి ఘోరమైన ఎన్నికలను చూడలేదు 
  • అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలు
  • ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ అణచివేసింది

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్‌రెడ్డి స్పందించారు. చిత్తూరులో వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీ కోట్లాది రూపాయలు కుమ్మరించి రాజకీయం చేసిందన్నారు. అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడిందన్నారు.

తెలంగాణ చరిత్రలోనే ఇంతటి ఘోరమైన ఎన్నికలను ఎప్పుడూ చూడలేదని.. ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ అణచివేసిందన్నారు. బీజేపీ వ్యతిరేకతతోనే తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టిందని సోమిరెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ పతనానికి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే నాంది అన్నారు. 2019లో అధికారంలోకి రాబోయేది బీజేపీయేతర వ్యతిరేక కూటమియేనన్నారు.

Somireddy Chandramohan Reddy
Amarnath Reddy
TRS
Telangana
  • Loading...

More Telugu News