kcr: ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలు సాధించిన విజయం.. శిరస్సు వంచి నమస్కరిస్తున్నా : సీఎం కేసీఆర్

  • సకల జనులు నిండుగా దీవించి ఇచ్చిన విజయమిది
  • నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు
  • ప్రజల తీర్పు మేరకు కర్తవ్య నిష్ఠతో పని చేయాలి

సకల జనులు నిండుగా దీవించి ఇచ్చిన విజయం ఇది అని, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాదు, తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలు సాధించిన విజయమని, వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.

గెలుపుతో అహంకారం రావొద్దని, ప్రజల తీర్పు మేరకు కర్తవ్య నిష్ఠతో పని చేయాలని సూచించారు. విజయం ఎంత ఘనంగా ఉందో, బాధ్యత కూడా అంత బరువుగా ఉందని అన్నారు. సమయం వృథా కాకుండా కష్టించి పనిచేయాలని, ప్రజల ఆకాంక్ష మేరకు కోటి ఎకరాలకు నీళ్లిచ్చి తీరుతామని అన్నారు.

kcr
Telangana
bhavan
Hyderabad
  • Loading...

More Telugu News