Superstar Krishna: కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక విజయాభినందనలు: సూపర్ స్టార్ కృష్ణ

  • కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలన్నీ ప్రజలకి ఎంతో మేలు చేశాయి
  • అన్ని వర్గాల ప్రజలు ఆయనకి అఖండ విజయాన్ని అందించారు
  • హృదయపూర్వక అభినందనలు తెలిపిన సూపర్ స్టార్

ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ తెరాస అధినేత కేసీఆర్ కి అభినందనలు తెలిపారు. నాలుగున్నరేళ్ల కాలం పరిపాలన తర్వాత ఇంత అత్యధిక స్థానాలలో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడం చాలా గొప్ప విషయం అని అన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలన్నీ ప్రజలకి ఎంతో మేలు చేశాయని, అందుకే అన్ని వర్గాల ప్రజలు ఆయనకి ఈ అఖండ విజయాన్ని అందించారని వెల్లడించారు. మళ్లీ రెండోసారి తెలంగాణకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న చంద్రశేఖరరావుకి కృష్ణ తన  హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

Superstar Krishna
TelanaganaElections2018
KCR
Telangana
  • Loading...

More Telugu News