Revanth Reddy: రేవంత్ రెడ్డికి ఘోర పరాభవం.. 10 వేల మెజారిటీతో టీఆర్ఎస్ ఘనవిజయం!
- పట్నం నరేందర్ రెడ్డి గెలుపు
- కూకట్ పల్లిలో ఆధిక్యంలో టీఆర్ఎస్
- ఖానాపూర్ లో రేఖానాయక్ ఘనవిజయం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు నమోదు అవుతున్నాయి. తాజాగా కొడంగల్ నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఘోర పరాజయం పాలయ్యారు. టీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి 10,770 మెజారిటీతో రేవంత్ రెడ్డిపై ఘనవిజయం సాధించారు. మరోవైపు కూకట్ పల్లిలో 14వ రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి నందమూరి సుహాసినిపై టీఆర్ఎస్ నేత మాధవరం కృష్ణారావు 30,000 ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇక సూర్యాపేటలో టీఆర్ఎస్ నేత, మంత్రి జగదీశ్ రెడ్డి 5,200 ఓట్ల లీడ్ తో కొనసాగుతున్నారు. ఖానాపూర్ లో టీఆర్ఎస్ నేత రేఖా నాయక్ ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ లో 51,515 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అలాగే శేరిలింగంపల్లి, కూకట్ పల్లిలోనూ కారు జోరుగా దూసుకుపోతోంది. శేరిలింగంపల్లిలో 23వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ తన సమీప ప్రత్యర్థి వెనిగళ్ల ఆనందప్రసాద్ 28,121 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.